విదేశీ సాయం వచ్చింది.. పంపిణీ మిగిలింది?

by  |
విదేశీ సాయం వచ్చింది.. పంపిణీ మిగిలింది?
X

న్యూఢిల్లీ: కరోనాతో కొట్టుమిట్టాడుతున్న మనదేశానికి సాయం అందించడానికి 40కిపైగా దేశాలు ముందుకువచ్చాయి. ఇప్పటికే ప్రాణాధార వైద్య పరికరాలు, ఆక్సిజన్ సంబంధిత ఎక్విప్‌మెంట్లు, ఆక్సిజన్‌నూ పంపించాయి. కానీ, వీటిని రాష్ట్రాలకు చేరవేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహించిందని ఆరోపణలు వస్తున్నాయి. గతనెల 25న సింగపూర్ నుంచి వైద్య సహాయం భారత్‌కు అందింది. అప్పటి నుంచి మరెన్నో దేశాలు ప్రాణాధార పరికరాలు, ఆక్సిజన్‌ను పంపించాయి. తొలి సహాయం అందిన 25వ తేదీ నుంచి వాటిని రాష్ట్రాలకు అందించడానికి అవసరమైన నిబంధనలు రూపొందించడానికే కేంద్ర ప్రభుత్వం వారం రోజులు తీసుకున్నదని కథనాలు వచ్చాయి.

దేశవ్యాప్తంగా హాస్పిటళ్లు ఆక్సిజన్ కోసం ఎస్‌వోఎస్‌లు పెడుతుంటే, మరణాలు పెరిగి, శ్మశనాలు ఫుల్ అయిపోయి భయాందోళనలు నెలకొన్న తరుణంలో ప్రాణాలు రక్షించే పరికరాల పంపిణీపై జాప్యం వహించడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 25న తొలి సహాయం అందితే, విదేశాల నుంచి అందిన అలాంటి సహకారాన్ని స్వీకరించి పంపిణీ చేయడానికి ప్రత్యేక ప్రక్రియను కేంద్ర ఆరోగ్య శాఖ మే 2న నోటిఫై చేసినట్టు తెలిసింది. డిస్ట్రిబ్యూషన్ మేనేజర్‌గా హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్‌ను నియమించింది. ఈ విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పందించింది.

విదేశాల నుంచి సహకారాన్ని చానెలింగ్ చేయడానికి నోడల్ ఏజెన్సీ ఫారీన్ మినిస్ట్రీ అని, విదేశాల నుంచి వివిధ రూపాల్లో(డొనేషన్లు) వచ్చిన సహాయాన్ని స్వీకరించి, పంపిణీ చేయడానికి కేంద్ర ఆరోగ్య శాఖ ఓ సెల్ ఏర్పాటు చేసిందని కేంద్రం వివరించింది. కస్టమ్స్ అధికారులు వీటిని వేగంగా క్లియర్ చేయడంతోపాటు బేసిక్ డ్యూటీ, హెల్త్ సెస్‌ల నుంచి మినహాయిస్తుందని, అత్యల్ప సమయవ్యవధిలో వాటిని మళ్లీ ప్యాక్ చేసి ఆరు గంటల్లోగా వాటిని డిస్పాచ్ చేసే ప్రక్రియ ముగుస్తుందని తెలిపింది. రాష్ట్రాల్లో కరోనా తీవ్రతకు అనుగుణంగా వీటి పంపిణీ ఉంటుందని వివరించింది.


Next Story

Most Viewed