ఫోర్బ్స్ ప్రపంచ శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్!

by  |
ఫోర్బ్స్ ప్రపంచ శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను ప్రముఖ ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి నలుగురు ఎంపికయ్యారు. ఫోర్బ్స్ పత్రిక ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం, దాతృత్వం, సీఈఓలు ఇలా పలు విభాగాల ఆధారంగా ప్రపంచ శక్తివంతమైన మహిళల జాబితాను రూపొందిస్తుంది. ఈ జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 37వ స్థానంలో ఉన్నారు.

ఆమె వరుసగా మూడోసారి ఈ జాబితాలో చోటు సంపాదించారు. ఆ తర్వాత దిగ్గజ ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్ 52వ స్థానంలోనూ, బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందార్ 72వ స్థానంలోనూ, ఆ తర్వాత ఇటీవల ఐపీఓ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన నైకా వ్యవస్థాపకులు ఫాల్గుని నాయర్ 88వ స్థానంలో ఉన్నారు. ఫల్గుని నాయర్ ఈ జాబితాలో మొదటిసారిగా చోటు దక్కించుకోవడం విశేషం. ఇక ఈ జాబితాలో మొదటి స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ నిలిచారు. రెండో స్థానంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, మూడో స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టిన్ లగార్డే, నాలుగో స్థానంలో జనరల్ మోటార్స్ సీఈఓ మేరీ బరా, ఐదో స్థానంలో మెలిండా గేట్స్ ఉన్నారు.



Next Story

Most Viewed