- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోనాల ఉత్సవాల్లో పూల వ్యాపారిని చిదిమేసిన టిప్పర్
by Batti.Sumithra |
<p>దిశ, షాద్‌నగర్: రోడ్డు ప్రమాదంలో పూల వ్యాపారి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కేశంపేట మండల కేంద్రానికి చెందిన చాపల నర్సింహులు(52) ఇన్ముల్ నర్వ గ్రామంలో బోనాలు ఉత్సవాలు జరుగుతున్నాయని పూలు అమ్ముకోవడానికి వెళ్ళాడు. రోడ్డు పక్కన తన టీవీఎస్‌ను పార్క్ చేస్తుండగా అతివేగంగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో టిప్పర్ చక్రాల కిందపడి నర్సింహులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతునికి భార్య, […]</p>

X
దిశ, షాద్‌నగర్: రోడ్డు ప్రమాదంలో పూల వ్యాపారి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కేశంపేట మండల కేంద్రానికి చెందిన చాపల నర్సింహులు(52) ఇన్ముల్ నర్వ గ్రామంలో బోనాలు ఉత్సవాలు జరుగుతున్నాయని పూలు అమ్ముకోవడానికి వెళ్ళాడు. రోడ్డు పక్కన తన టీవీఎస్‌ను పార్క్ చేస్తుండగా అతివేగంగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో టిప్పర్ చక్రాల కిందపడి నర్సింహులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రమాదం జరిగిన అనంతరం టిప్పర్ డ్రైవర్ పారిపోయాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
- Tags
- Florist
Next Story






