తెగిన చెరువుకట్ట.. కొట్టుకొచ్చిన వాహనాలు

72

దిశ, వెబ్‌డెస్క్: గతరాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌ పాతబస్తీ ప్రాంతంలోని బాలాపూర్ గుర్రం చెరువుకట్ట తెగిపోయింది. దీంతో ఉప్పుగూడ, సాయిబాబానగర్, శివాజీనగర్, బాబానగర్ బస్తీల్లో వరద బీభత్సం సృష్టించింది. అంతేగాకుండా బాబానగర్‌లో వరదనీరు ఇళ్లలోకి చేరి, అతలాకుతలం చేసింది.

ఈ వరద ఉధృతికి ఇళ్ల ఎదుట నిలిపి ఉంచిన వాహనాలు కొట్టుకుపోయాయి. విషయం తెలిసిన హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఓవైసీ బాబానగర్ ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. జిల్లెలగూడ చెరువు కూడా పొంగిపొర్లడంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.