రికార్డుస్థాయిలో మూసీ వరద ఉధృతి

by  |
రికార్డుస్థాయిలో మూసీ వరద ఉధృతి
X

దిశ, వెబ్‎డెస్క్ : గత రెండు రోజులుగా కుండపోత వర్షాలకు హైదరాబాద్ మహానగరం నీటమునిగింది. పలుకాలనీల ప్రజలు జలదిగ్భంధంలో ఉన్నారు. వాగులు, వంకలతో పాటు నగరంలోని వీధుల నుంచి వచ్చే వరదలన్నీ మూసీలో కలవడంతో ఉధృతంగా ప్రహించింది. దీంతో మూడు దశాబ్దాల తర్వాత రికార్డుస్థాయిలో మూసీ నది వరద పోటెత్తింది.

నల్లగొండ జిల్లాలో రెండో అతిపెద్ద సాగునీటి వనరైన మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చింది. బుధవారం ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో అధికంగా రావడంతో ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 645 అడుగులు దాటిపోయింది. 647.50 అడుగులకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 11క్రస్టుగేట్లు, 2రెగ్యులేటరీ గేట్లను 19అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు మొత్తం 20 గేట్లు ఉండగా వీటిలో 12 క్రస్టుగేట్లు, 8రెగ్యులేటరీ గేట్లున్నాయి. భారీ వరద తాకిడికి ఎగువ నుంచి పెద్ద ఎత్తున తాటిచెట్లు కొట్టుకొచ్చాయి. ఇవి గేట్లకు తగిలి వరదతో పాటు కిందకు వెళ్తుండడంతో భారీగా శబ్దాలతో భయాందోళన పరిస్థితి ఏర్పడింది.


Next Story