శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

by  |
శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఎగువన ఉన్న కృష్ణమ్మ, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. జలాశయం ఇన్‎ఫ్లో 2,54,353 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‎ఫ్లో 3,51,761 క్యూసెక్కులు కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలకు గానూ, ప్రస్తుతం 212.9198 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతోంది.

జూరాల నుంచి 1,70,450 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 25,007 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 56,896 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 2వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. దీంతో కుడి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్తు కోసం 26,792 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.



Next Story

Most Viewed