- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
48,432 మందికి వరద సాయం
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు 48,232 మందికి వరద సాయం అందించినట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. సోమవారం ఒక్క రోజే 10,005 మందికి వరద సహాయంగా రూ. 10 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు ఓ ప్రకటనలో వివరించింది. ఈ నెల ఏడో తేదీ నుంచే వరద సాయాన్ని అందిస్తామని ముందుగా ప్రకటించినప్పటికీ ఎనిమిదో తేదీ నుంచి కార్యక్రమాన్ని అధికారులు మొదలు పెట్టారు. గత వారం రోజుల్లో 48,232 మందికి రూ. […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు 48,232 మందికి వరద సాయం అందించినట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. సోమవారం ఒక్క రోజే 10,005 మందికి వరద సహాయంగా రూ. 10 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు ఓ ప్రకటనలో వివరించింది. ఈ నెల ఏడో తేదీ నుంచే వరద సాయాన్ని అందిస్తామని ముందుగా ప్రకటించినప్పటికీ ఎనిమిదో తేదీ నుంచి కార్యక్రమాన్ని అధికారులు మొదలు పెట్టారు.
గత వారం రోజుల్లో 48,232 మందికి రూ. 48.23 కోట్లను సంబంధిత లబ్ధిదారుల బ్యాంకులలో జమ చేసినట్టు బల్దియా అధికారులు తెలిపారు. ఈ నె 8-10 తేదీల్లో 28 ,436 మందికి రూ. 28 .44 కోట్లను జమ చేసిన అధికారులు ఆ తర్వాత ఎలాంటి గణంకాలు విడుదల చేయలేదు. సోమవారం మరో పది కోట్లు నిధులు జమ చేసినట్టు తెలిపారు. గడిచిన వారం రోజుల్లో ఐదు రోజులు మాత్రమే బ్యాంకు ఖాతాల్లో వరద సాయం వేసినట్టు తెలుస్తోంది.
Next Story






