ఫ్లిప్‌కార్ట్‌లో 'బిగ్ బిలియన్ డేస్' విక్రయాలు!

by  |
business news
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది పండుగ సీజన్ సందర్భంగా బిగ్ బిలియన్ డేస్ విక్రయాలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. తాజాగా సంస్థ ఈ ఆఫర్ గడువు అక్టోబర్ 7వ తేదీ నుంచి 12 వరకు ఉంటుందని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కర్ట్ స్మార్ట్‌ఫోన్, టీవీలు, వాషింగ్ మెషీన్ సహా పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందించనుంది. అలాగే, ఈసారి పండుగ సీజన్ కోసం యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నట్టు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. దీనివల్ల వినియోగదారులు మరింత ఎక్కువ రాయితీలను పొందగలరని అభిప్రాయపడింది. అంతేకాకుండా పేటీఎమ్ లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ఇస్తున్నామని వెల్లడించింది.

ఈ పండుగ సీజన్‌లో కొత్తగా మోటోరోలా, శాంసంగ్, ఒప్పో, వీవో, రియల్‌మీ, పోకో బ్రాండ్‌లకు చెందిన కొత్త మొబైల్ మోడళ్లను విడుదల చేయనుంది. గతవారం ఫ్లిప్‌కార్ట్ సంస్థ విడుదల చేసిన బిగ్ బిలియన్ డేస్ సేల్ వివరాల ప్రకారం.. స్మార్ట్‌వాచ్ ఉత్పత్తులపై 70 శాతం వరకు తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ ఇవ్వనుంది. అలాగే, బోట్ ఉత్పత్తులపై అత్యధికంగా 80 శాతం, ఇంటెల్ ల్యాప్‌టాప్‌లకు 40 శాతం వరకు తగ్గింపును ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఇంకా, హెడ్‌ఫోన్, స్పీకర్, ఇతర ఉత్పత్తులపై 80 శాతం, టీవీల్, రీఫ్రిజిరేటర్ల వంటి గృహోపకరణాలపై 70 శతం వరకు తగ్గింపు ప్రయోజనాలను ఫ్లిప్‌కార్ట్ ఇవ్వనుంది.

Next Story

Most Viewed