ఏడాది చివరి నాటికి 1,000 ఎలక్ట్రిక్ వాహనాలతో డెలివరీ : ఫ్లిప్‌కార్ట్

by  |
ఏడాది చివరి నాటికి 1,000 ఎలక్ట్రిక్ వాహనాలతో డెలివరీ : ఫ్లిప్‌కార్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని గణనీయంగా పెంచాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ తన సరుకుల డెలివరీల కోసం ఎలక్ట్రిక్ వాహనాలను భారీగా ప్రారంభించింది. ఇప్పటికే పైలెట్ ప్రాజెట్ ద్వారా బ్యాటారీతో ప్రయాణించే టూ-వీలర్, త్రీవీలర్ వాహనాలను హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వినియోగిస్తోంది. తాజాగా, 2030 నాటికి దేశంలో 25 వేలకుపైగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించి వినియోగదారులకు సరుకులు డెలివరీ చేయాలని భావిస్తోంది.

ఈ ప్రణాళిక అమలులో భాగంగా లాజిస్టిక్ భాగస్వామ్యం ద్వారా మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ, హీరో ఎలక్ట్రిక్, పియాజియో కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. రాబోయే కాలంలో దేశీయంగా సరుకుల డెలివరీల్లో ఈ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాలను వాడనున్నారు. ‘లాజిస్టిక్స్ కంపెనీల భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు పనిచేస్తామని, త్వరలో డెలివరీ హబ్స్, ఆఫీసుల్లో ఛార్జింగ్ స్టేషన్లు కంపెనీ అందుబాటులోకి తీసుకొస్తుందని’ ఫ్లిప్‌కార్ట్ హెడ్ మహేష్ ప్రతాప్ సింగ్ చెప్పారు. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ఫ్లిప్‌కార్ట్ ప్రారభించిందని, ప్రస్తుతం తమ కంపెనీలో 450 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 1,000 ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తామని ఆయన వెల్లడించారు.



Next Story