కరోనా ఎఫెక్ట్.. దేశంలో ఐదు అప్‌డేట్స్

by  |
కరోనా ఎఫెక్ట్.. దేశంలో ఐదు అప్‌డేట్స్
X

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,076 కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ ప్రకటించింది. 38 మంది మృతిచెందారని తెలిపింది. దేశంలో వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి ఇప్పటివరకు 11,0439 కేసులు నమోదు కాగా, 377 మంది మృతిచెందారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయ తీసుకున్న విషయం విధితమే.

– రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్రలో 2,687 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఢిల్లీ (1561), తమిళనాడు (1204), రాజస్థాన్ (969), మధ్యప్రదేశ్ (730) ఉన్నాయి.

– మేఘాలయా రాష్ట్రంలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. మృతిచెందిన తర్వాత వైద్యుడి శరీరం నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా పాజిటివ్ అని తేలింది.

– లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన పుదుచ్చేరి కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్‌కుమార్‌పై పోలీసులు రెండోసారి కేసు నమోదు చేశారు. కొవిడ్-19 నిబంధనలకు విరుద్ధంగా మంగళవారం ఎమ్మెల్యే తన స్వగ్రామంలో 150 మందికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

– లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే స్వగ్రామాలకు వెళ్లేందుకు వలస కూలీలు పెద్ద ఎత్తున ముంబైలోని బాద్రా పశ్చిమ బస్టాండ్‌కు తరలివచ్చిన విషయం తెలిసిందే. వలస కూలీలను రెచ్చగొట్టి జనం గుమిగూడటానికి కారణమైనట్లు పేర్కొంటూ కార్మిక నాయకుడు వినయ్ దూబేను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.

Tags: corona outbreak, 1076 new cases in last 24 hours, 38 people dead,highest cases in maharashtra, meghalaya first case report


Next Story

Most Viewed