గడ్చిరౌలిలో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టుల మృతి!

by  |
గడ్చిరౌలిలో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టుల మృతి!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోలు, పోలీసుల మధ్య తూటాల వర్షం కురుస్తోంది. జిల్లాలోని కుర్‌ఖేడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అవుతున్నారన్న సమాచారం మేరకు గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ C-60 బలగాలను రంగంలోకి దింపారు. శనివారం మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో రెండు గంటలకు పైగా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయని ప్రచారం సాగింది.

ఆదివారం ఉదయం కోభ్రామేంద, హేటాలక్సా అటవీ ప్రాంతంలో సుమారు 60 నుండి 70మంది మావోలు కూంబింగ్ చేస్తున్న C-60 జవాన్లకు తారసపడగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు అటవీ ప్రాంతం గుండా వెళ్లిపోయారు. తిరిగి C-60 జవాన్లు సోమవారం కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టుల మళ్లీ ఎదురు పడటంతో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మరణించారని, వీరిలో ముగ్గురు మగవాళ్లు, ఇద్దరు స్త్రీలు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందింది. అయితే, పోలీసు అధికారులు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించడం లేదు. ఘటనా స్థలం నుండి మావోయిస్టులు ఉపయోగించే సామగ్రిని కూడా కూంబింగ్ పార్టీలు స్వాధీనం చేసుకున్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.


Next Story

Most Viewed