కుప్పలు తెప్పలుగా.. ఎగిరి దుంకుతున్న చేపలు : వీడియో వైరల్!

572
fishes-adilabad

దిశప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ వర్షాలు కురియడంతో పెద్ద వాగులోని ప్రధాన వీధులు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని చెరువులు ఉప్పొంగడంతో నీరు రోడ్లపైకి రావడంతో అందులోని చేపలు కూడా పెద్ద ఎత్తున ప్రవాహంలో కొట్టుకొచ్చాయి. దీంతో భైంసా రోడ్డులోని మంజులాపూర్, ఆదిలాబాద్ రోడ్డులోని బ్రహ్మంగారి మఠం వద్ద, బంగల్పేట్ చెరువు వద్ద పెద్ద ఎత్తున చేపలు రోడ్లపైన దర్శనమిచ్చాయి.

వీటిని పట్టేందుకు కొందరు వలలు వేయగా ఒక్కో చేప పది నుంచి ఇరవై కిలోల బరువు ఉన్నట్లు తెలుస్తోంది. చెరువుల్లో సామర్థ్యానికి మించి నీరు ఎక్కువగా చేరటంతో కొన్ని చేపలు ప్రవాహంలో కొట్టుకుపోగా మరికొన్ని ఎదురీదాయి. ఈ క్రమంలోనే కొన్ని రోడ్లపై కనిపించడంతో వాటిని పట్టుకునేందుకు రోడ్లపై జనం పరుగులు పెట్టారు. ఆ దృశ్యాలు రన్నింగ్ రేసును తలపించాయి. చేపలు వరద ప్రవాహంలో సందడి చేస్తున్న అద్బుత దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Disha official Facebook page : https://www.facebook.com/dishatelugunews

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..