- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘనంగా మత్స్యకారుల దినోత్సవం
<p>దిశ, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మత్స్యకార యువజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు వాసుపల్లి జానకిరామ్ ఆధ్వర్యంలో శనివారం విశాఖలో మత్య్సకార దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు, వైసీపీ పార్లమెంటరీ పక్షనేత విజయసాయి రెడ్డి ముఖ్య అతిథిగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాష్ట్ర మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… గత ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం వలసలు తగ్గించడానికి, మత్స్యకారుల […]</p>

దిశ, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మత్స్యకార యువజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు వాసుపల్లి జానకిరామ్ ఆధ్వర్యంలో శనివారం విశాఖలో మత్య్సకార దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు, వైసీపీ పార్లమెంటరీ పక్షనేత విజయసాయి రెడ్డి ముఖ్య అతిథిగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాష్ట్ర మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… గత ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం వలసలు తగ్గించడానికి, మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. మూడు వేల కోట్లతో ప్రతిపాదించిన ఫిషింగ్ హార్బర్లకు గానూ మొదటి విడతగా 4 ఫిషింగ్ హార్బర్ లను ఏర్పాటు చేస్తూ శంకుస్థాపన చేశారని, త్వరలో 100 కోట్లతో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్, ఉత్తరాంధ్ర మత్స్యకార నాయకులు సింహాద్రి అప్పన్న, వాసుపల్లి రాము, సురపతి నర్సింగ్, బడే ఎల్లాజీ, గనగళ్ల రాజేష్ పాల్గొన్నారు.






