- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేటకు వెళ్లి.. వలకు బలయ్యాడు!
<p>దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా బద్వేలు మండలం లక్ష్మీపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బద్వేల్ పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు వలలో చిక్కుకుని ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళితే… బద్వేల్ మండలం లక్ష్మీపాలెం గ్రామానికి చెందిన వైకుంఠ చెన్నయ్య(50) చేపలు పట్టి జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పెద్ద చెరువులో చేపలకై వల అమర్చాడు. బుధవారం తెల్లవారుజామున వల నుండి చేపలను బయటకు తెచ్చే క్రమంలో అదే వలలో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా బద్వేలు మండలం లక్ష్మీపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బద్వేల్ పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు వలలో చిక్కుకుని ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళితే… బద్వేల్ మండలం లక్ష్మీపాలెం గ్రామానికి చెందిన వైకుంఠ చెన్నయ్య(50) చేపలు పట్టి జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి పెద్ద చెరువులో చేపలకై వల అమర్చాడు. బుధవారం తెల్లవారుజామున వల నుండి చేపలను బయటకు తెచ్చే క్రమంలో అదే వలలో చిక్కుకుని మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడు పుట్టు మూగవాడు కావడంతో సహాయం కోసం అరిచే అవకాశం కూడా లేకపోయిందని కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. కాగా మృతుడు చెన్నయ్యకు నలుగురు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు. చెన్నయ్య మృతితో ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయింది.
Next Story






