- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరీంనగర్‌లో టీఆర్ఎస్‌కు మరో షాక్.. నామినేషన్ వేసిన ఎంపీటీసీ
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్ సిటీ: అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఎంపీటీసీల రూపంలో షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలైన రెండో రోజున చొప్పదండి వైస్ ఎంపీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భూపాలపట్నం ఎంపీటీసీ మునిగాల విజయ లక్ష్మీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో తన నామినేషన్ పత్రాలను అందించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ సభ్యులను ఉత్సవ విగ్రహాలుగా మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల్లో కానీ మండల […]</p>

X
దిశ, కరీంనగర్ సిటీ: అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఎంపీటీసీల రూపంలో షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలైన రెండో రోజున చొప్పదండి వైస్ ఎంపీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భూపాలపట్నం ఎంపీటీసీ మునిగాల విజయ లక్ష్మీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో తన నామినేషన్ పత్రాలను అందించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ సభ్యులను ఉత్సవ విగ్రహాలుగా మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల్లో కానీ మండల పరిషత్‌లలో కానీ తమకు నిధులు కేటాయించలేదని, కనీసం కూర్చునేందుకు కూడా కుర్చీలు లేవన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి మండలిలో తమ గళాన్ని వినిపిస్తామని విజయ లక్ష్మీ వెల్లడించారు.
Next Story






