- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరంజీవి టైటిల్ కొట్టేసిన టాలీవుడ్ యంగ్ హీరో
<p>దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి, అమల జంటగా 1990లో రిలీజైన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించగా.. ఆశించిన విజయం దక్కలేదు. ఇప్పుడు ఇదే టైటిల్‌తో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఓ మూవీ చేయబోతున్నాడు. ‘ఆర్‌ఎక్స్ 100’తో యువ ప్రేక్షకుల మనసు దోచిన కుర్ర హీరోకు ఇది 7వ సినిమా కాగా, వీవీ వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కాగా ఈ చిత్ర టైటిట్‌తో […]</p>

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి, అమల జంటగా 1990లో రిలీజైన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించగా.. ఆశించిన విజయం దక్కలేదు. ఇప్పుడు ఇదే టైటిల్‌తో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఓ మూవీ చేయబోతున్నాడు. ‘ఆర్‌ఎక్స్ 100’తో యువ ప్రేక్షకుల మనసు దోచిన కుర్ర హీరోకు ఇది 7వ సినిమా కాగా, వీవీ వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
కాగా ఈ చిత్ర టైటిట్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆదివారం సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తిచేసుకోగా, త్వరలోనే మిగతా పార్ట్ పూర్తిచేసి రిలీజ్‌కు సిద్ధం చేస్తామని నిర్మాత 88 రామారెడ్డి తెలిపారు. ఇక సీనియర్ తమిళ నటుడు రవిచంద్రన్ మనుమరాలు ‘తాన్యా’ ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమవుతుండగా.. ప్రశాంత్ విహారి మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్‌గా పీసీ మౌళి పనిచేస్తున్న చిత్రంలో సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు.






