ఆడి కంపెనీపై ఫిర్యాదు!

by  |
ఆడి కంపెనీపై ఫిర్యాదు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ అనుబంధ సంస్థ ఆడి కంపెనీపై దేశంలో తొలిసారిగా కేసు నమోదైంది. ఉద్గార నిబంధనలకు సంబంధించి నోయిడాకు చెందిన ఓ వ్యక్తి ఆడి కంపెనీపైనా, ఇతర ఉన్నతాధికారులపైనా ఫిర్యాదు చేశారు. నేర పూరిత కుట్ర, ఫోర్జరీ, మోసం ఆరోపణలతో కంపెనీపై కేసు నమోదైంది. కాలుష్య నివారణ, ఉద్గారాల శాతం తక్కువగా ఉండే పరికరాలతో మోసం చేశారని అనిల్ జిత్ అనే వ్యక్తి కేసు పెట్టారు. ఈ ఫిర్యాదులో జర్మనీలో ఆయా సంస్థల ప్రధాన కార్యాలయాలు సహా ఫోక్స్ వ్యాగన్, ఆడి ఉన్నతాధికారులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఇందులో ఆడి ఇండియా డైరెక్టర్ రాహిల్ అన్సారి, ఆడి ఇండియా హెడ్ బల్‌బీర్ సింగ్, ఆడి ఏజీ ఛైర్మన్ బ్రామ్‌షాట్ పేర్లను చేర్చారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి 2018లో కోట్ల విలువైన 7 ఆడి కార్లను కొనుగోలు చేశాడు. డెలివరీ సమయానికి భారత్‌లో చీట్ డివైజెస్ గురించి వివరించినట్టు, కానీ అలాంటివి లేవని మోసం చేశారని ఆరోపణలు చేశారు. అయితే, భారత్‌లో ఆడి కార్ల నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలు అనుమతి ఉన్న పరిమితుల కంటే 5-8 రెట్లు ఎక్కువగా ఆడి కార్లలో ఉన్నాయని తెలియడం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వోక్స్‌వ్యాగన్‌పై రూ. 500 కోట్ల జరిమానా విధించిన తర్వాత అసలు విషయం తెలిసిందని వివరించారు. నకిలీ పరికరాలు, తప్పుడు పత్రాలతో కావాలనే కంపెనీను మోసం చేశాయని ఆరోపించారు. ఈ అంశంపై అధికారు దర్యాప్తు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనుమతించిన పరిమితి కంటే 10-40 రెట్లు ఉద్గారాలను ఉత్పత్తి చేస్తున్న పరికరాలను కార్లలో అమర్చారనే ఆరోపణలు కంపెనీపై వచ్చాయి. అంతేకాకుండా, భారత మార్కెట్లలో ప్రవేశపెట్టిన డీజిల్ కార్లలో చిట్ డివైజ్ వల్ల పర్యావరణానికి అత్యధిక నష్టం ఉంటుందని ఎన్‌జీటీ గతేడాది మార్చిలో ఫోక్స్‌వ్యాగన్‌కు రూ. 500 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed