యూత్‌ను రీస్టోర్ చేసే డిఫరెంట్ ‘ఫస్ట్ డేట్’

by  |
యూత్‌ను రీస్టోర్ చేసే డిఫరెంట్ ‘ఫస్ట్ డేట్’
X

దిశ, వెబ్‌డెస్క్: అమ్మాయిలు.. ఎదిగే క్రమంలో ఎన్నో కలలు కంటారు. చదువు పూర్తికాగానే అందమైన రాకుమరుడిని పెళ్లి చేసుకుని చక్కటి ఫ్యామిలీతో సెటిల్ అయిపోవాలని కొందరు కలలు కంటే.. చదువులో రాణించి ఆ తర్వాత ఉద్యోగం చేయాలి..పేరెంట్స్‌కు తోడుగా ఉండాలి.. ఇండిపెండెంట్ లైఫ్‌ లీడ్ చేయాలి.. ప్రేమ అనే ఎమోషన్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయాలని మరికొందరు అనుకుంటారు. ఆ తర్వాతే పెళ్లి అని నిర్ణయించుకుంటారు. కానీ, పరిస్థితుల ప్రభావమో లేక అమ్మానాన్నకు భయపడో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి కలలు నేరవేర్చుకోకుండా పెళ్లి చేసేసుకుంటారు. అక్కడ్నుంచి మొదలైన కుటుంబ భారం జీవితాంతం మోస్తూనే ఉంటారు. వయసైపోయాక, పిల్లలు ఎదిగాక రియలైజ్ అవుతుంటారు..అయ్యో ఆ రోజు నాన్నతో పెళ్లి గురించి మాట్లాడుంటే నా జీవితంలో కూడా నేను కోరుకున్న మంచి జ్ఞాపకాలు ఉండేవి కదా అని బాధపడుతుంటారు. అయినా ఇప్పుడనుకుని ఏం లాభంలే అని కొందరు గమ్మున కూర్చుంటే.. గతంలో కోల్పోయిన అదృష్టాన్ని ఇప్పుడెందుకు రీ కలెక్ట్ చేసుకోకూడదని మరికొందరు ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో వచ్చిన షార్ట్ ఫిల్మ్ ‘ఫస్ట్ డేట్’.

ప్రస్తుతం సొసైటీలో ఉన్న రియాలిటీని బేస్ చేసుకుని డిఫరెంట్ టేక్‌తో వచ్చింది ‘ఫస్ట్ డేట్’. అమ్మాయి కలలకు పెళ్లి బ్రేక్ వేయగా.. ఆ క్రమంలో పాతికేళ్ల జీవితాన్ని గడిపేయగా.. ఐదు పదులకు ఒంటరిగా మిగిలిపోయింది. ఆ సమయంలో మళ్లీ జీవితాన్ని కొత్తగా ఆస్వాదించాలనుకున్న ఒంటరి గృహిణి.. పెళ్లి, పిల్లలు, బాధ్యతలు మోస్తూ తన డ్రీమ్స్ అచీవ్ చేసే క్రమంలో ప్రతిసారీ ఫెయిల్ అయిన ఆమె ఫస్ట్ డేట్‌ సక్సెస్ అయిందా? కొత్త జీవితాన్ని ఆరంభించిందా? అనే కథను చాలా నీట్‌గా ప్రజెంట్ చేశాడు యంగ్ డైరెక్టర్ జగన్నాధ శాస్త్రి. కమెడియన్ ఎల్‌.బి.శ్రీరామ్, రాజశ్రీ నాయర్ ప్రధానపాత్రల్లో వచ్చిన ఫిల్మ్‌.. ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్.. వి కెన్ ఎక్స్‌ప్రెస్ అవర్ లవ్ ఎట్ ఎనీ టైమ్‌’ అనేది స్టోరీ లైన్. యూత్‌ను రీస్టోర్ చేసుకునేందుకు డేట్‌కు వచ్చిన 50 ఏళ్ల వయస్సున్న మెన్, ఉమన్ మధ్య కన్వర్జేషన్‌తో.. షార్ట్ ఫిల్మ్ చూస్తున్న చాలా మందికి తమ తమ అనుభవాలను గుర్తుకు తెచ్చారు. డెస్టినేషన్ కంటే జర్నీ ఇంపార్టెంట్ అనే కంటెంట్‌తో వచ్చిన మేకర్స్, పశ్చాత్తాపం మనను తినేస్తుందని, ఒక్కసారి ప్రయత్నించి విఫలమైతే అలాగే కూర్చుండి పోకుండా మరోసారి ప్రయత్నించి చూడాలనే మెసేజ్ ఇచ్చారు. మనం ఎలా ఉండాలి అనుకుంటున్నామో? ఏం సాధించాలి అనుకుంటున్నామో? చేస్తూ పోవాలి. అదే లైఫ్.. అంతేకానీ వయసు అయిపోయిందని చేయాలనుకున్నది చేయకుండా ఉండిపోకూడదు.. చనిపోయే వరకు కూడా ట్రై చేస్తూనే ఉండాలని చెప్పింది ‘ఫస్ట్ డేట్’.

ఆ సమయంలోనే ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంది? పేరెంట్స్‌తో కమ్యూనికేట్ అవుతుందా? లేక లవ్, ఫ్రెండ్‌షిప్ అంటూ లైఫ్‌లో ఎంజాయ్ చేస్తూనే ఉండిపోతుందా? చదువు అయిపోయి జాబ్ రాగానే.. వారి వారి ఆఫీస్‌ పనుల్లో బిజీ అయిపోయి.. సెపరేట్ గదుల్లో చిల్ అవుతున్న పిల్లలు సింగిల్ పేరెంట్స్ ఎమోషన్స్ ఎంత వరకు అర్థం చేసుకుంటున్నారు? ఇదంతా వారి ఫేట్ అని వదిలేస్తారా? లేక వారు పంచిన ప్రేమను తిరిగి పంచుతూ ఒంటరి అనే భావన కలిగించకుండా ఉంటారా? .. ఆలోచించుకోమని సూచించింది ‘ఫస్ట్ డేట్’.


Next Story

Most Viewed