హాస్పిటల్ వద్ద మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం…

by Sridhar Babu |

<p>దిశ, వేములవాడ: వేములవాడ అర్బన్ మండలం తిప్పాపురంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి పక్కకు ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. మరో పది రోజుల్లో ప్రారంభానికి సిద్ధమైన ఆసుపత్రి వద్ద ఉన్న చెట్లకు నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఇప్పటికే ఆసుపత్రికి ఫర్నీచర్, మెటీరియల్ కూడా వచ్చాయి. యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రి పనులు పూర్తి చేస్తుండగా, ఈ అగ్నిప్రమాదం జరగడంపై గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈఘటనలో [&hellip;]</p>

హాస్పిటల్ వద్ద మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం…
X

దిశ, వేములవాడ: వేములవాడ అర్బన్ మండలం తిప్పాపురంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి పక్కకు ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. మరో పది రోజుల్లో ప్రారంభానికి సిద్ధమైన ఆసుపత్రి వద్ద ఉన్న చెట్లకు నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఇప్పటికే ఆసుపత్రికి ఫర్నీచర్, మెటీరియల్ కూడా వచ్చాయి. యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రి పనులు పూర్తి చేస్తుండగా, ఈ అగ్నిప్రమాదం జరగడంపై గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈఘటనలో ఎలాంటి అస్తి, ప్రాణ నష్టం జరుగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story