‘యాదగిరి’లో గుట్టలపై చెలరేగిన మంటలు

44

దిశ, ఆలేరు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొండ కింద గల లక్ష్మీ పుష్కరిణికి ,అతిథి గృహాల మధ్య ఉన్న గుట్టలపై ఆదివారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అందరూ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు స్థానికులు తెలియజేశారు. దీంతో అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వేసిన చెత్తాచెదారంలో అనుకోని విధంగా మంటలు చెలరేగాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..