సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం

34

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ ప్రభుత్వాసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. సఫ్దర్ ‌జంగ్ ఆస్పత్రి నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు కూడా దట్టంగా వ్యాపించడంతో ఆ ఫ్లోర్‌లో ఉన్న పేషెంట్లు, సిబ్బంది ఇతర వార్డుల్లోకి పరుగులు తీశారు. ఫోర్త్‌ ఫ్లోర్‌లో ఉన్న నర్సింగ్ రూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఏడు ఫైర్ ఇంజిన్లను రంగంలోకి దింపి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.