ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం…

by Shamantha N |   (  Updated:2021-06-12 00:51:40  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ ఢిల్లీలోని లాజ్‌పత్ నగర్ సెంట్రల్ మార్కెట్‌లోని ఓ షోరూం లోపల శనివారం మంటలు చెలరేగాయి. ఉదయం 10.20 గంటలకు సెంట్రల్ మార్కెట్‌లోని ఐ-బ్లాక్ నుంచి తమకు కాల్ వచ్చిందని, ఆ తర్వాత 16 ఫైర్ టెండర్లు, అంబులెన్స్‌లను అక్కడికి తరలించినట్లు అధికారులు తెలిపారు. 70 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అరికట్టడానికి మోహరించారు. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ “షోరూమ్ నుండి ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. [&hellip;]</p>

fire accidnent in south delhi
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ ఢిల్లీలోని లాజ్‌పత్ నగర్ సెంట్రల్ మార్కెట్‌లోని ఓ షోరూం లోపల శనివారం మంటలు చెలరేగాయి. ఉదయం 10.20 గంటలకు సెంట్రల్ మార్కెట్‌లోని ఐ-బ్లాక్ నుంచి తమకు కాల్ వచ్చిందని, ఆ తర్వాత 16 ఫైర్ టెండర్లు, అంబులెన్స్‌లను అక్కడికి తరలించినట్లు అధికారులు తెలిపారు. 70 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అరికట్టడానికి మోహరించారు.

ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ “షోరూమ్ నుండి ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. మేము దానిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాము. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.” అని వెల్లడించారు. షోరూం లోపల ఎవరైనా ఉన్నారా అని తనిఖీ చేస్తున్నామని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తెలిపారు.

Next Story