- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిక్కర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: వనపర్తి జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ లిక్కర్ ఫ్యాక్టరీలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఏబీడీ లిక్కర్ ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం హఠాత్తుగా మంటలు చెలరేగాయి. బాయిలర్‌లో అధిక వేడి కారణంగా పైపులు పగిలిపోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. మిగిలిన నలుగురిని వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: వనపర్తి జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ లిక్కర్ ఫ్యాక్టరీలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఏబీడీ లిక్కర్ ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం హఠాత్తుగా మంటలు చెలరేగాయి. బాయిలర్‌లో అధిక వేడి కారణంగా పైపులు పగిలిపోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. మిగిలిన నలుగురిని వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story






