విశాఖ HPCL పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-05-31 15:59:08  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విశాఖపట్టణం జిల్లా హెచ్‌పీసీఎల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో పొగ దట్టంగా కమ్ముకున్నది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో భారీ శబ్ధం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు సమాచారం. అయితే, HPCLలో అగ్ని ప్రమాదం వలన భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే, ఎలాంటి ప్రాణహాని సంభవించలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ప్రమాదానికి సంభవించిన […]</p>

విశాఖ HPCL పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విశాఖపట్టణం జిల్లా హెచ్‌పీసీఎల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో పొగ దట్టంగా కమ్ముకున్నది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో భారీ శబ్ధం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు సమాచారం. అయితే, HPCLలో అగ్ని ప్రమాదం వలన భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే, ఎలాంటి ప్రాణహాని సంభవించలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ప్రమాదానికి సంభవించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story