- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రూప్ బజార్‌లో అగ్నిప్రమాదం
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: నిత్యం వాహనాలు, కొనుగోలు దారులతో రద్ధీగా ఉండే ట్రూప్ బజార్ మార్కెట్‌లోని ఓ దుకాణంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే గమనించిన స్థానిక దుకాణాదారులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెండుగంటల పాటు శ్రమించి మంటలు ఆర్పేశారు. ఈ సంఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ట్రూప్ బజార్ ప్రాంతానికి […]</p>

దిశ ప్రతినిధి, హైదరాబాద్: నిత్యం వాహనాలు, కొనుగోలు దారులతో రద్ధీగా ఉండే ట్రూప్ బజార్ మార్కెట్‌లోని ఓ దుకాణంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే గమనించిన స్థానిక దుకాణాదారులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెండుగంటల పాటు శ్రమించి మంటలు ఆర్పేశారు. ఈ సంఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ట్రూప్ బజార్ ప్రాంతానికి చెందిన కిరణ్ మోడీ అదే ప్రాంతంలో డీకే శానిటరీ పేరుతో శానిటరీ వస్తువుల విక్రయాలను ఫస్ట్ ఫ్లోర్‌లో గోదాం నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే రాత్రి 8 గంటల సమయంలో దుకాణం మూసేసి ఇంటికి వెళ్లిపోయాడు.
అనంతరం గోదాం నుంచి మంటలు, పొగ రావడాన్ని గమనించిన స్థానికులు గౌలిగూడ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సకాలంలో స్పందించి ఉండకపోతే.. మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించి భారీ ప్రమాదం చోటు చేసుకుని ఉండేదని చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత లేదని సుల్తాన్ బజార్ ఇన్ స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి తెలిపారు. విద్యుదాఘాతం మూలంగా ప్రమాదం జరిగిందని తెలిపారు. లక్షలలో ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని చెప్పారు.






