ఆ పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఫర్నీచర్‌తో కార్మికుల పరుగులు

by Batti.Sumithra |

<p>దిశ, కుత్బుల్లాపూర్: ప్లైవుడ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన జైన్ అనే వ్యక్తి మరికొంత మంది స్నేహితులతో కలిసి బహదూర్‌పల్లిలో ప్లైవుడ్ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే కార్మికులు ఆదివారం పనులు చేస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కార్మికులు అందులో ఉన్న ఫర్నీచర్‌ను బయటకు తీసుకెళ్లారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. [&hellip;]</p>

ఆ పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఫర్నీచర్‌తో కార్మికుల పరుగులు
X

దిశ, కుత్బుల్లాపూర్: ప్లైవుడ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన జైన్ అనే వ్యక్తి మరికొంత మంది స్నేహితులతో కలిసి బహదూర్‌పల్లిలో ప్లైవుడ్ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే కార్మికులు ఆదివారం పనులు చేస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కార్మికులు అందులో ఉన్న ఫర్నీచర్‌ను బయటకు తీసుకెళ్లారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో స్వల్ప ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది.

Next Story