పెద్ద అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు.(వీడియో)

182

దిశ, అబ్దుల్లాపూర్‌మెట్ : పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్వాల్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ గోడౌన్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఐదు ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మంటలు ఎగిసిపడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

హుటాహుటిన పోలీసులకి, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. గోడౌన్‌లోకి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో జేసీబీల సాయంతో గోడలు కూల్చివేశారు. గోడౌన్‌లో ఎలాంటి సరుకు నిల్వ చేశారన్నది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. గోడౌన్‌లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తుండటంతో కెమికల్ పదార్థాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..