ఖమ్మం పట్టణంలో భారీ అగ్నిప్రమాదం.. రూ.25 లక్షల ఆస్తి నష్టం

by  |
ఖమ్మం పట్టణంలో భారీ అగ్నిప్రమాదం.. రూ.25 లక్షల ఆస్తి నష్టం
X

దిశ, ఖమ్మం కల్చరర్ : ఖమ్మం పట్టణం శ్రీనివాస్ నగర్ అయ్యప్ప స్వామి టెంపుల్ వెనుక గల ప్రాథమిక ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంతంలో తెల్లవారు జామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం ప్రకారం 27వ డివిజన్‌ కార్పొరేటర్ దొడ్డా నగేష్ స్పందించి వెంటనే అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని ఫైర్ స్టేషన్ ఆఫీసుకు, త్రీ టౌన్ పోలీస్‌ స్టేషన్‌కు, ఎమ్మార్వో ఆఫీస్‌కు సమాచారం అందించారు. ఫైర్ స్టేషన్ అధికారులు వెంటనే రెండు ఫైరింజన్లను పంపి చెలరేగుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారని చెప్పారు. అలాగే త్రీ టౌన్ సీఐ సర్వయ్య ఇద్దరు కానిస్టేబుల్‌లను పంపారని, ఎమ్మార్వో ఆఫీస్ నుంచి వీఆర్వో మస్తాన్ వచ్చి వివరాలను సేకరించారని తెలిపారు.

అదృష్టవశాత్తు పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం ఏమీ జరగలేదని స్థానిక కార్పొరేటర్ వెల్లడించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దుగడ మిషన్ యజమాని వాసి రెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ.. 200 వంద ఫీట్ల టేకు కర్ర, డబుల్ కాట్ మంచాల బోర్డులు, డబుల్ కాట్ మంచాలు, తలుపులు, కిటికీలు, దుగడ మిషిన్లుతో పాటు రేకుల షెడ్డు కూడా అగ్నికి ఆహుతయ్యారని చెప్పారు. ఈ షాపును నమ్ముకుని సుమారు 10 కుటుంబాలు బతుకుతున్నాయని వివరించారు. గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నామన్నారు. ఈ ప్రమాదంలో సుమారుగా రూ. 25 లక్షలు విలువ గల ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని దుగడ మిషన్ యూనియన్ నాయకులు కోరారు .


Next Story

Most Viewed