- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం.. మూడు దుకాణాలు దగ్ధం
by Batti.Sumithra |
<p>దిశ రాజేంద్రనగర్ : ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో మూడు దుకాణ సముదాయాలు అగ్నికి ఆహుతైన ఘటన ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని కూరగాయల మార్కెట్లో గల హోటల్ లోని గ్యాస్ సిలిండర్ పేలి పక్కనే ఉన్న మూడు కూరగాయల దుకాణాలకు మంటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. చుట్టుపక్కల ఉన్న స్థానికులు పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి […]</p>

X
దిశ రాజేంద్రనగర్ : ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో మూడు దుకాణ సముదాయాలు అగ్నికి ఆహుతైన ఘటన ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని కూరగాయల మార్కెట్లో గల హోటల్ లోని గ్యాస్ సిలిండర్ పేలి పక్కనే ఉన్న మూడు కూరగాయల దుకాణాలకు మంటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి.
చుట్టుపక్కల ఉన్న స్థానికులు పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు పూర్తిగా ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో కూరగాయల మార్కెట్ లో ఎవరు లేక పోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటన స్థలానికి చేరుకున్న ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






