- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాపం.. ఏపీలో మరో విషాదం
<p>దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్ పారిశ్రామిక వాడ పరవాడలోని రాంకీ ఫార్మా కంపెనీలో పేలుళ్ళు చోటు చేసుకున్నాయి. పేలుళ్ల శబ్దానికి గాజువాక పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌లో ఈ పేలుడు సంభవించింది. పేలుళ్ళు సమయంలో కంపెనీలో నలుగురు పనిచేస్తున్నారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ నలుగుర్ని గాజువాకలోని ఆసుపత్రికి తరలించారు. రియాక్టర్ పేలుడు కారణంగా సంభవించిన ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. పరిసర ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. గాజువాక పరిసరాల్లోని ఆరు అగ్నిమాపక శకటాలు […]</p>

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్ పారిశ్రామిక వాడ పరవాడలోని రాంకీ ఫార్మా కంపెనీలో పేలుళ్ళు చోటు చేసుకున్నాయి. పేలుళ్ల శబ్దానికి గాజువాక పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌లో ఈ పేలుడు సంభవించింది. పేలుళ్ళు సమయంలో కంపెనీలో నలుగురు పనిచేస్తున్నారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ నలుగుర్ని గాజువాకలోని ఆసుపత్రికి తరలించారు. రియాక్టర్ పేలుడు కారణంగా సంభవించిన ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. పరిసర ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. గాజువాక పరిసరాల్లోని ఆరు అగ్నిమాపక శకటాలు సంఘటనాస్థలానికి చేరుకున్నాయి. మంటల తీవ్రత భారీగా ఉండడంతో అవి దూరంగా నిలిచిపోయాయి. దీంతో నేవీని రంగంలోకి దించారు. ఈ ప్రదేశంలో ఇప్పటికి 17సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. కలెక్టర్ వినయ్ చంద్ పరిస్థితిని సమీక్షించారు. సాల్వెంట్ నిల్వచేసే రియాక్టర్ లో పేలుడు సంభవించింది. రాంకీ సాల్వెంట్ కంపెనీ పరిసరాల్లో మరో ఏడు ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఆయా పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.






