- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రముఖ ఆగ్రో కంపెనీలో అగ్నిప్రమాదం.. పట్టించుకోని యాజమాన్యం
<p>దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మాజీగూడెంలోని ప్రసిద్ధ ఆగ్రో కంపెనీలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ధర్మాజీ గూడెం గ్రామంలో పారిసన్ పాలిమర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో రసాయన డ్రమ్ములు పేలి భారీగా మంటలు వ్యాపిస్తున్నాయి. ఈ కంపెనీలో సుమారు 80 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపెద్ద శబ్దాలతో కెమికల్స్ డ్రమ్ములు పేలడంతో స్థానికులు […]</p>

X
దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మాజీగూడెంలోని ప్రసిద్ధ ఆగ్రో కంపెనీలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ధర్మాజీ గూడెం గ్రామంలో పారిసన్ పాలిమర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో రసాయన డ్రమ్ములు పేలి భారీగా మంటలు వ్యాపిస్తున్నాయి. ఈ కంపెనీలో సుమారు 80 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపెద్ద శబ్దాలతో కెమికల్స్ డ్రమ్ములు పేలడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్న కంపెనీ యాజమాన్యం అందుబాటులో లేకపోవడం విచారకరం. స్థానిక ఫైర్ సిబ్బంది ఇక్కడకు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్న ఇంకా మంటలు అదుపులోకి రావడం లేదు.
Next Story






