ఆ కేసులో ఎస్ఐపై ఎఫ్ఐఆర్ నమోదు

by  |

దిశ, ఉత్తరాంధ్ర : విజయనగరం జిల్లా బొండపల్లి ఎస్ఐ ఆర్.వాసుదేవరావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఉన్నతాధికారులు. బొండపల్లి మండలం కనిమెరక గ్రామానికి చెందిన గోవింద మహేష్‌ను కులం పేరుతో దూషించి, చిత్రహింసలు గురి చేస్తున్నారంటూ జిల్లా ఎస్పీ దీపికా పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఎస్ఐ వాసుదేవరావుపై పోలీస్ ఉన్నతాధికారులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అయితే నెల రోజులు(13-9-2021) క్రితం ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు దర్యాప్తు చేయలేదని, వెంటనే చర్యలు తీసుకొని తమకు న్యాయం కల్పించాలని బాధితుడు కోరారు.

ఇదే విషయమై డీఎస్పీ శ్రీనువాసరావుని వివరణ కోరగా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశామని, ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. ఉద్యోగ రీత్యా విజయవాడ దుర్గా దేవి అమ్మవారి బందోబస్తుకు వెళ్లడం, మధ్యలో కొన్ని రోజులు లీవ్ పెట్టడం వలన దర్యాప్తు చేయలేకపోయామని తెలిపారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed