దళితుడు ఆలయంలోకి ప్రవేశిస్తే తప్పా..? ఇంకెన్నాళ్లీ దారుణాలు

by Batti.Sumithra |   (  Updated:2021-09-28 02:20:40  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ యువకుడు ఆలయంలోకి ప్రవేశించాడని అతనిపై కక్షపూరిత చర్యలకు దిగారు అక్కడి పెద్దమనుషులు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. కొప్పల్ పోలీస్ సూపరింటెండెంట్ టి. శ్రీధర్ కథనం ప్రకారం.. 24 ఏళ్ల దళిత యువకుడు స్థానికంగా గల లక్ష్మీదేవి ఆలయంలోకి ప్రవేశించినందుకు గాను అతనికి అక్షరాల రూ.11,000 జరిమానాను అక్కడి పెద్దలు విధించారు. సెప్టెంబర్ 14న ఈ ఘటన జరగగా.. [&hellip;]</p>

దళితుడు ఆలయంలోకి ప్రవేశిస్తే తప్పా..? ఇంకెన్నాళ్లీ దారుణాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ యువకుడు ఆలయంలోకి ప్రవేశించాడని అతనిపై కక్షపూరిత చర్యలకు దిగారు అక్కడి పెద్దమనుషులు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది.

కొప్పల్ పోలీస్ సూపరింటెండెంట్ టి. శ్రీధర్ కథనం ప్రకారం.. 24 ఏళ్ల దళిత యువకుడు స్థానికంగా గల లక్ష్మీదేవి ఆలయంలోకి ప్రవేశించినందుకు గాను అతనికి అక్షరాల రూ.11,000 జరిమానాను అక్కడి పెద్దలు విధించారు. సెప్టెంబర్ 14న ఈ ఘటన జరగగా.. జరిమానా డబ్బుల కోసం పెద్దమనుషులు ఒత్తిడి చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.

అయితే, కొంతకాలం కిందట జిల్లాలోని కరటగి గ్రామంలో దొంగతనం జరిగింది. ఆ తరువాత ఆలయ పూజారులు, అధికారులు ఆలయంలోకి తాము తప్పా ఎవరూ రావొద్దని ప్రకటించారు. ఈ క్రమంలోనే “దళిత వ్యక్తి ఆలయంలో ప్రార్థనలు నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేసాడు. సెప్టెంబర్ 14న ఆలయంలోకి ప్రవేశించి ప్రార్థనలు చేసినట్టు తెలిసింది. ఈ విషయం శుక్రవారం పూజారులకు తెలియడంతో రూ.11వేల జరిమానా కట్టాలని శిక్ష విధించారు. అది భరించలేని వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.

దీంతో శిక్ష విధించిన వారిపై షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగ (అత్యాచారాల నిరోధక) చట్టం మరియు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని ఒక పోలీసు అధికారి తెలిపారు.

ఇదిలాఉండగా, సెప్టెంబర్ 4న కూడా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఓ దళిత బాలుడి తల్లిదండ్రులు రెండేళ్ల కుమారుడి పుట్టినరోజు సందర్భంగా హనుమంతుడి ఆలయంలోకి ప్రవేశించగా వారికి రూ. 23,000 జరిమానా విధించారు పెద్దమనుషులు. అంతకుముందు నుంచి దళితులందరినీ లోపలికి అనుమతించక పోవడంతో వారు బయటి నుండి మాత్రమే దేవుడిని పూజించి వెళ్లిపోతారు.

బాలుడు ఉన్నట్టుండి ఆలయంలోకి పరిగెత్తడంతో అతన్ని పట్టుకుందామని పేరెంట్స్ కూడా ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో ఆలయ అధికారులు వారికి రూ.23,000 జరిమానా విధించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు.

Next Story