- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం.. మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మెదక్: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం చింతలఘాట్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ నెంబర్ జాతీయ రహదారిపై గోవా నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జహీరాబాద్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గాంధీ […]</p>

X
దిశ ప్రతినిధి, మెదక్: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం చింతలఘాట్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ నెంబర్ జాతీయ రహదారిపై గోవా నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జహీరాబాద్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జైంది. దీంతో యువతి మృతదేహం కారులో ఇరుక్కుపోయింది. మృతిచెందిన యువతి నిహారిక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రేన్ సాయంతో కారును పక్కకు తప్పించి ఆ మార్గంలో రాకపోకలను పునరుద్ధరించారు.
Next Story






