- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డెంగీతో మహిళా వైద్యురాలు మృతి
by Shyam |
<p>దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని మీనాక్షి ఎస్టేట్స్ కు చెందిన వైద్యురాలు డాక్టర్ అర్పితారెడ్డి డెంగీతో మృతి చెందారు. నగరంలోని గ్లోబల్ హాస్పిటల్‌లో వారం రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అంగడిపేట సేఫ్ హాస్పిటల్‌లో జనరల్ ఫిజీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఆమె ఇటీవలే మీనాక్షి ఎస్టేట్స్‌లో అద్దెకు దిగారు. అపరి శుభ్రత, దోమలు, పారిశుధ్య సమస్య అధికంగా ఉండడం వల్ల కాలనీవాసులు అనారోగ్యాలకు […]</p>

X
దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని మీనాక్షి ఎస్టేట్స్ కు చెందిన వైద్యురాలు డాక్టర్ అర్పితారెడ్డి డెంగీతో మృతి చెందారు. నగరంలోని గ్లోబల్ హాస్పిటల్‌లో వారం రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అంగడిపేట సేఫ్ హాస్పిటల్‌లో జనరల్ ఫిజీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఆమె ఇటీవలే మీనాక్షి ఎస్టేట్స్‌లో అద్దెకు దిగారు. అపరి శుభ్రత, దోమలు, పారిశుధ్య సమస్య అధికంగా ఉండడం వల్ల కాలనీవాసులు అనారోగ్యాలకు గురవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. అదే సమస్య ఓ వైద్యురాలి ప్రాణాలు తీసిందని, ఈ ఘటన కలచి వేస్తుందని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






