- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాల కోసం వెళ్లి.. పరలోకానికి
by Batti.Sumithra |
<p>దిశ, రంగారెడ్డి: పాల కోసం వెళ్లిన తండ్రీకొడుకు ఇళ్లు చేరేలోపే పరలోకానికి వెళ్లారు. దీంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును, ఎంతో భవిష్యత్తు ఉన్న కుమారుడిని కోల్పోయింది. బుధవారం రాత్రి షాద్ నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సల్ల పాండు(41), వరణ్ తేజ్(11) అనే తండ్రీకొడుకు మృతి చెందారు. పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో వీరు నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి వీరిద్దరూ పాల కోసం స్కూటీపై పొలం వెళ్తుండగా.. డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. […]</p>

X
దిశ, రంగారెడ్డి: పాల కోసం వెళ్లిన తండ్రీకొడుకు ఇళ్లు చేరేలోపే పరలోకానికి వెళ్లారు. దీంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును, ఎంతో భవిష్యత్తు ఉన్న కుమారుడిని కోల్పోయింది. బుధవారం రాత్రి షాద్ నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సల్ల పాండు(41), వరణ్ తేజ్(11) అనే తండ్రీకొడుకు మృతి చెందారు. పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో వీరు నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి వీరిద్దరూ పాల కోసం స్కూటీపై పొలం వెళ్తుండగా.. డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






