ఛీ.. ఛీ.. వీడు అసలు తండ్రేనా ? కన్న కూతురిపైనే నెలలుగా..

by  |
guntakal
X

దిశ, వెబ్ డెస్క్: నాన్న.. మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ మనకు ఏ కష్టం రానియ్యకుండా నిత్యం కాపాడుతుంటాడు. మన యోగక్షేమాల కోసమే ఎప్పుడూ ఆరాటపడుతుంటాడు. కానీ, ఓ దుర్మార్గుడు నాన్న అనే పదానికే మచ్చ తెచ్చాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కాటేశాడు. తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన ఏపీలో వెలుగు చూసింది.

తెలిసిన సమాచారం మేరకు.. అనంతపురం జిల్లాలోని గుంతకల్లు భాగ్యనగర్ కు చెందిన ఓ వ్యక్తికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే, పెయింటింగ్ పని చేసే అతను తాగుడుకు బానిసయ్యాడు. తన పదిహేనేళ్ల వయసు గల పెద్ద కూతురిపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. తల్లికి అనుమానమొచ్చి అతడిని నిలదీయడంతో ఆమెపై దాడి చేశాడు. కూతురి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇటీవల గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి ఆ బాలికను తీసుకెళ్లింది. బాలికకు వైద్యపరీక్షలు చేసిన అనంతరం బాలిక గర్భవతి అని వైద్యులు చెప్పారని.. దీంతో తన కూతురికి అబార్షన్ చేయాలని వైద్యులను కోరిందని.. ఇందుకు వారు నిరాకరించారని.. అనంతరం వారు పోలీసులకు సమాచారమిస్తామనడంతో తన కూతురిని తీసుకుని ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిసింది.

ఆ తర్వాత బాలికను కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా వైద్యపరీక్షలు చేసిన వైద్యులు బాలిక గర్భవతి అని నిర్ధారించారని.. అనంతరం వారు విషయాన్ని పోలీసులకు తెలపడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆరా తీయగా అసలు విషయం బయటపడినట్లు సమాచారం. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.


Next Story

Most Viewed