ఛీ ఛీ వీడసలు మనిషా.. పశువా.. ఒక కూతురిని రేప్ చేసి మరో కూతురితో

by  |
ఛీ ఛీ వీడసలు మనిషా.. పశువా.. ఒక కూతురిని రేప్ చేసి మరో కూతురితో
X

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. కామవాంఛలు ఎక్కువై కొంతమంది మృగాళ్లు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. వావి వరుస, చిన్నాపెద్ద అనే ఇంగితాన్ని మరిచి కామకోరికలను తీర్చుకుంటున్నారు. తాజాగా ఓ కామాంధుడు కన్నపేగు బంధాన్ని కూడా మరిచాడు. రక్తం పంచుకు పుట్టిన కూతురి పాలిట కీచకుడిలా మారాడు. అంతేకాదు వరుసకు కూతురయ్యే బాలికపైనా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికను ముద్దు చేస్తున్నట్లు గదిలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఒక బాలికకు కడుపు నొప్పి రాగా తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా బాలికపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు తెలిపారు. దీంతో బాలికను ఆరా తీయగా వరుసకు తండ్రి అయ్యే అతను తనను గదిలోకి తీసుకెళ్లి, బట్టలు విప్పి లైంగిక దాడి చేసినట్లు తెలిపింది. ఇక ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. సదురు నిందితుడు ఈ బాలికతో పాటు, తన సొంత కూతురిని కూడా వదలలేదని, ఆమెపై కూడా పలుసార్లు అత్యాచారం చేసినట్లు తెలిసింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.

Follow Disha daily Official Facebook page: https://www.facebook.com/dishatelugunews


Next Story