- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం: పిల్లలను చంపిన తండ్రి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : మతిస్థిమితం లేని తండ్రి చేతిలో ఇద్దరు పిల్లలు దారుణహత్యకు గురయ్యారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో రవి అనే వ్యక్తి మతిస్థిమితం లేని కారణంగా తన ఇద్దరు చిన్నారులను హత్య చేశాడు. బుధవారం రాత్రి తన ఇద్దరు కొడుకులను గ్రామ శివారులోని సమీపంలోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపి పూడ్చిపెట్టాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు ఇద్దరు చిన్నారులను వెలికితీశారు. కుటుంబసభ్యుల […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : మతిస్థిమితం లేని తండ్రి చేతిలో ఇద్దరు పిల్లలు దారుణహత్యకు గురయ్యారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో రవి అనే వ్యక్తి మతిస్థిమితం లేని కారణంగా తన ఇద్దరు చిన్నారులను హత్య చేశాడు. బుధవారం రాత్రి తన ఇద్దరు కొడుకులను గ్రామ శివారులోని సమీపంలోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపి పూడ్చిపెట్టాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు ఇద్దరు చిన్నారులను వెలికితీశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు రవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కళ్యాణదుర్గం రూరల్ ఎస్ఐ సుధాకర్ తెలిపారు.
Next Story






