- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. కొడుకు మృతదేహాన్ని తరలిస్తుండగా.. తండ్రి మృతి
<p>దిశ, నిజామాబాద్ రూరల్ : మరణించిన కొడుకు మృత దేహాన్ని తరలిస్తుండగా ప్రమాదవశాత్తు గంట వ్యవధిలోనే తండ్రి మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. క్రాంతేష్ (30) కొడుకు మృతదేహాన్ని ఇంటికి చెరవేసే క్రమంలో జక్రాన్పల్లి మండల కేంద్రంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుడి తండ్రి మస్తా బాబన్న (61) మృతి చెందినట్లు ఎస్సై సాయి రెడ్డి బుధవారం సాయంకాలం పేర్కొన్నారు. […]</p>

దిశ, నిజామాబాద్ రూరల్ : మరణించిన కొడుకు మృత దేహాన్ని తరలిస్తుండగా ప్రమాదవశాత్తు గంట వ్యవధిలోనే తండ్రి మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. క్రాంతేష్ (30) కొడుకు మృతదేహాన్ని ఇంటికి చెరవేసే క్రమంలో జక్రాన్పల్లి మండల కేంద్రంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుడి తండ్రి మస్తా బాబన్న (61) మృతి చెందినట్లు ఎస్సై సాయి రెడ్డి బుధవారం సాయంకాలం పేర్కొన్నారు. ఎస్సై కథనం ప్రకారం.. క్రాంతేష్ ఈనెల పదవ తారీఖున జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్‌తో అడ్మిట్అయి చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. డెడ్ బాడీని ఇంటికి తరలించే క్రమంలో మృతుడి తల్లిదండ్రులు బాబన్న, తల్లి సరితలు స్వగ్రామ మైన మోర్తాడ్ మండల కేంద్రానికి జిల్లా కేంద్రం నుండి అంబులెన్స్ లో పయనమయ్యారు.
ఈ నేపథ్యంలోనే జక్రాన్పల్లి మండల కేంద్రం వద్ద 44 నెంబర్ జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వస్తున్న టిప్పర్ అంబులెన్స్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మృతుడు క్రాంతేష్ తండ్రి బాబన్న అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. ఈ దుర్ఘటన చుసి స్థానికులు, గ్రామస్థులు, కుటుంబీకులు శోకసముద్రంలో మునిగిపోయారు. గంట వ్యవధిలోనే తండ్రీ కొడుకులు మృతి చెందడంతో కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సాయిరెడ్డి పేర్కొన్నారు. అనంతరం బాబన్న మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.






