బాలుడితో యువతి ప్రేమాయణం.. తెలిసిన తండ్రి ఏంచేశాడంటే..?

by  |
బాలుడితో యువతి  ప్రేమాయణం.. తెలిసిన తండ్రి ఏంచేశాడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ.. ఎప్పుడు, ఎవరి మధ్య, ఎలా పుడుతుందో ఎవరికి తెలియదు. కానీ బిడ్డల ప్రేమ కన్నవాళ్లకు అడ్డంకులుగా మారుతున్నాయి. కులాలు, మతాలు అంటూ ప్రేమించుకున్నవారిని విడదీయడానికి వారిని హత్య చేయడానికి కూడా వెనకాడడం లేదు. తాజాగా కూతురు తనకన్నా చిన్నవాడైన బాలుడిని ప్రేమించిందని కూతురితో సహా బాలుడిని అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు ఓ తండ్రి. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. కాన్పూర్ కి చెందిన ఓ ట్రక్ డ్రైవర్ కుమార్తె, అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలుడు ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి ఆమెను మందలించాడు. కానీ, ఆమె వినలేదు.. ఈ నేపథ్యంలోనే యువతి కుటుంబ సభ్యులు శనివారం బంధువుల పెళ్లికి పక్కగ్రామానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన బాలుడు, యువతి ఇంటికి వెళ్ళాడు.

అయితే వీరిద్దరిని ఇంట్లో చూసిన యువతి సమీప బంధువు వారిని ఇంట్లో ఉంచి తాళం వేశాడు. ఈ విషయాన్ని పెళ్ళికి వెళ్లిన యువతి తండ్రికి చేరవేశాడు. ఇక మరో పక్క శనివారం నుండి తన కొడుకు కనిపించడంలేదని బాలుడు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం సాయంత్రం ఇంటికి చేరుకున్న యువతి తండ్రి కోపోద్రేకుడై సొంత కూతురని విచక్షణ మరిచి బాలుడును, కూతురును గొడ్డలితో నరికిచంపాడు. పోలీసులు విచారించి యువతి ఇంటికి వెళ్లి చూసేసరికి వారిద్దరూ రక్తపు మడుగులో విగతజీవులుగా కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed