- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి చేయాలని తండ్రితో గొడవ.. అంతలోనే !
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి చేయాలని కన్నతండ్రితో గొడవకు దిగిన ఓ యువకుడు చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి కొత్తూరు మండలం చేగూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు.. తనకు పెళ్లి చేయాలని తండ్రితో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. మద్యం మత్తులో ఉన్న తండ్రి ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకొని యువకుడిపై దాడి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి చేయాలని కన్నతండ్రితో గొడవకు దిగిన ఓ యువకుడు చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి కొత్తూరు మండలం చేగూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు.. తనకు పెళ్లి చేయాలని తండ్రితో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. మద్యం మత్తులో ఉన్న తండ్రి ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకొని యువకుడిపై దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే యువకుడి తండ్రి అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న యువకుడిని కుటుంబసభ్యులు, స్థానికులు కలిసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






