- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్న బిడ్డను అతిదారుణంగా హత్య చేసిన ఘటనలో తండ్రి అరెస్ట్
<p>దిశ, బెజ్జుర్ : కన్నబిడ్డ పసికందును అతి కిరాతకంగా హత్య చేసిన తండ్రిని అరెస్టు చేసినట్లు కాగజ్ నగర్ డీఎస్పీ కర్ణాకర్ తెలిపారు. బుధవారం పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పసిపాప హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెల్లడించారు. కాగజ్‌నగర్ మండలంలోని లైన్ కూడా గ్రామానికి చెందిన మెస్రం బాబురావును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. గతంలో ఇద్దరు ఆడపిల్లలు ఉండగా, ఇటీవల మూడో సంతానం ఆడపిల్ల పుట్టడంతో […]</p>

దిశ, బెజ్జుర్ : కన్నబిడ్డ పసికందును అతి కిరాతకంగా హత్య చేసిన తండ్రిని అరెస్టు చేసినట్లు కాగజ్ నగర్ డీఎస్పీ కర్ణాకర్ తెలిపారు. బుధవారం పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పసిపాప హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెల్లడించారు. కాగజ్‌నగర్ మండలంలోని లైన్ కూడా గ్రామానికి చెందిన మెస్రం బాబురావును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. గతంలో ఇద్దరు ఆడపిల్లలు ఉండగా, ఇటీవల మూడో సంతానం ఆడపిల్ల పుట్టడంతో కోపోద్రిక్తుడైన బాబురావు వారసులు లేరని ఆగ్రహంతో ఇంటికి వెళ్లి భార్యను చంపుతానని బెదిరించి పసికందును సీసీ రోడ్డుపై పడేసి, బండరాయితో మోదడమ్‌తో పసిపాప అక్కడికక్కడే మృతి చెందింది. పసిపాపను అతికిరాతకంగా చంపినందుకు బాబురావుపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి, జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ రాజేంద్ర ప్రసాద్, పోలీసులు పాల్గొన్నారు.






