సరదా కాస్త ప్రాణాలు తీసింది..

by Batti.Sumithra |

<p>లాక్‌డౌన్ నేపథ్యంలో సరదగా ఈత కొట్టేందుకు చెరువుకు వెళ్లిన తండ్రీ కొడుకులు తమ ప్రాణాలు కోల్పొయారు.ఈ ఘటన నాగర్ కర్నూల్‌లోని తిమ్మాజీపేటలో శనివారం చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం..ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని తిమ్మాజిపేటకు చెందిన తండ్రీ కొడుకులు గురవయ్య(40), శివ(9) సరదాగ ఈత కొట్టేందుకు సమీపంలోని చెరువుకు వెళ్లారు.ప్రమాదవ శాత్తు ఇద్దరూ నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పొయారు. చుట్టుపక్కల స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృత దేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం [&hellip;]</p>

సరదా కాస్త ప్రాణాలు తీసింది..
X

లాక్‌డౌన్ నేపథ్యంలో సరదగా ఈత కొట్టేందుకు చెరువుకు వెళ్లిన తండ్రీ కొడుకులు తమ ప్రాణాలు కోల్పొయారు.ఈ ఘటన నాగర్ కర్నూల్‌లోని తిమ్మాజీపేటలో శనివారం చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం..ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని తిమ్మాజిపేటకు చెందిన తండ్రీ కొడుకులు గురవయ్య(40), శివ(9) సరదాగ ఈత కొట్టేందుకు సమీపంలోని చెరువుకు వెళ్లారు.ప్రమాదవ శాత్తు ఇద్దరూ నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పొయారు. చుట్టుపక్కల స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృత దేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్టున్నట్టు పోలీసులు తెలిపారు.

Next Story