కొనుగోలు కేంద్రాల వద్దే రైతులు.. ఇంకా స్పందించని అధికారులు

by  |
కొనుగోలు కేంద్రాల వద్దే రైతులు.. ఇంకా స్పందించని అధికారులు
X

దిశ, పరకాల: పరకాల సబ్ డివిజన్ పరిధిలోని శాయంపేట, ఆత్మకూర్, దామెర, నడికూడ, పరకాల మండలాలలో ఈ సంవత్సరం ఖరీఫ్ లో 37 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారు 90 వేల టన్నుల వరి ధాన్యం దిగుబడి రానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే అన్ని మండలాల్లో ఐకెపి, పిఎసిఎస్, ఓడిసిఎంఎస్, అక్కడక్కడ రైతు సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు ఏర్పాటు జరిగి ఒక్కోచోట పది రోజులకు పైగానే అవుతోంది. కానీ ఇప్పటివరకు ఎక్కడా కాంటాలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో దిశ పత్రిక పలు కొనుగోలు కేంద్రాల్ని సందర్శించగా, ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కాంటాలు ఎందుకు నిర్వహించడం లేదంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ప్రశ్నించగా మాయిశ్చర్ రాలేదు అంటున్నారు. రైతులు మాత్రం పంట కోసి 20 రోజులు అవుతుంది. అప్పటినుండి కల్లాల్లో ఆరబోస్తూనే ఉన్నామంటున్నారు. మాయిశ్చర్ పేరుతో అధికారులు, ప్రభుత్వం రైతులను దగా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు పంట పండించడమే శాపంగా మారిందని కొనుగోళ్లు ఉంటాయో లేదోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తక్షణమే కొనుగోలు కేంద్రాల్లో కాంటా నిర్వహించాలని లేనట్లయితే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.



Next Story

Most Viewed