‘అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి’

by Shyam |

<p>హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 7న కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. మంగళవారం కురిసిన వర్షాలతో చేతికందొచ్చిన వరి పంట అనేక జిల్లాల్లో దెబ్బతిన్నదని వెల్లడించింది. వడగండ్ల ధాటికి వడ్లు పూర్తిగా నేలరాలాయని వాపోయింది. కావునా, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నష్ట పరిహారాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరింది. ఆహార ధాన్యాలకు ఎకరానికి రూ.20వేలు, పండ్ల తోటలకు ఎకరానికి [&hellip;]</p>

‘అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి’
X

హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 7న కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. మంగళవారం కురిసిన వర్షాలతో చేతికందొచ్చిన వరి పంట అనేక జిల్లాల్లో దెబ్బతిన్నదని వెల్లడించింది. వడగండ్ల ధాటికి వడ్లు పూర్తిగా నేలరాలాయని వాపోయింది. కావునా, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నష్ట పరిహారాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరింది. ఆహార ధాన్యాలకు ఎకరానికి రూ.20వేలు, పండ్ల తోటలకు ఎకరానికి రూ.40వేలు చొప్పున పరిహారం చెల్లించాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.జంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. సాగర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags: premature rains damaged crops, compensate, farmers union, telangana, jangareddy, stone rain

Next Story