వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట

by  |
వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట
X

దిశ, వెబ్ డెస్క్ : భవిష్యత్ సమాజానికి ఆరోగ్యవంతమైన వాతావరణం అందించడమే మనం చేసే మేలు అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానంఇస్తూ.. ఆయిల్ ఫామ్ పర్యావరణహిత వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తున్నట్టుగా ఆయన తెలిపారు. దేశంలో 70 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగుకావాలి దీంతో పాటు తెలంగాణలో నువ్వులు, ఆవాలు ఇతర నూనెగింజల సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు.

ఇప్పటికే తెలంగాణలోని 25 జిల్లాలలో ఆయిల్ ఫామ్ సాగుకు కేంద్రం ఆమోదం ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సాగుకోసం ముందుకు వచ్చిన సంస్థలతో ఒప్పదం కుదుర్చుకున్నట్టు, 8 లక్షల ఎకరాలలో పంటను సాగు చేసేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఆయిల్ ఫామ్ గెలల నుంచి 21 శాతం ఆయిల్ వస్తుందన్నారు. ఇది జాతీయ సగటు18 శాతం ప్రతి 10, 15 వేల ఎకరాలకు ఒక ఆయిల్ ఫామ్ క్రషింగ్ యూనిట్ ఏర్పాటు అవుతుందని తెలిపారు. దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు.

ఆయిల్ ఫామ్ సాగుకు రైతాంగాన్ని ప్రోత్సహించాలి..

ఎకరాకు 20 టన్నుల కార్పన్ డై ఆక్సైడ్ తీసుకుని 22 టన్నుల ఆక్సిజన్ విడుదల చేసే ఏకైక పంట ఆయిల్ ఫామ్. చీడపీడలు, రాళ్లవాన, కోతుల బెడదలేని ఏకైక పంట, చెరుకు, వరి మినహా అన్ని రకాల అంతరపంటలు వేసుకునేదుకు అవకాశం ఉంటుదన్నారు. అలానే ప్రభుత్వం నుంచి అనేక రాయితీలు ఇస్తామని తెలిపారు. ఒక ఎకరా వరి సాగుచేసే నీటితో నాలుగు ఎకరాల ఆయిల్ ఫామ్ సాగవుతుందని, రూపాయికి నాలుగు రూపాయల ఆదాయం లభిస్తుందన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాగు అనుకూలంగా, సాగునీరు అందుబాటులో ఉన్న నేపథ్యంలో అందరూ ఆయిల్ ఫామ్ సాగుకు రైతాంగాన్ని ప్రోత్సహించాలని చెప్పారు.

కరోనా నేపథ్యంలో ఆయిల్ ఫామ్ సాగు రైతులను ప్రోత్సహించే సమావేశాలను రద్దు చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు బడ్జెట్ లో రూ.1500 కోట్లు కేటాయించడం జరిగింది. 2021 – 22 సంవత్సరానికి గాను, రూ.951.28 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక ప్రక్రియలో ఉందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 6 లక్షల 66 వేల 221 మంది రైతులకు వ్యవసాయ యాంత్రీకరణతో లబ్ధి చేకూరిందన్నారు. శాసనసభలో ఆయిల్ ఫామ్ సాగు, వ్యవసాయ యాంత్రీకరణపై సభ్యులు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, సండ్ర వెంకటవీరయ్య, బాజిరెడ్డి గోవర్దన్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎల్గనమోని అంజయ్య యాదవ్ ల ప్రశ్నలకు సమాధానమిచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.


Next Story

Most Viewed