- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జొన్నలు కొనండి.. వినూత్నంగా రైతుల జల దీక్ష
by Chintha Aamani |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తాము ఆరుగాలం కష్టపడి సాగు చేసిన జొన్న పంటను కొనుగోలు చేయాలని జొన్న రైతులు గత కొద్డిరోజులుగా ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్నారు. అయితే, అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చివరకు రైతులు జల దీక్షకు దిగారు. బుధవారం బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన పలువురు రైతులు తమ జొన్నలు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కనుగుట్ట పెద్ద వాగులో దిగి అర్థనగ్నంగా దీక్ష చేపట్టారు. అంతకుముందు బోథ్ పొచేర […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తాము ఆరుగాలం కష్టపడి సాగు చేసిన జొన్న పంటను కొనుగోలు చేయాలని జొన్న రైతులు గత కొద్డిరోజులుగా ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్నారు. అయితే, అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చివరకు రైతులు జల దీక్షకు దిగారు. బుధవారం బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన పలువురు రైతులు తమ జొన్నలు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కనుగుట్ట పెద్ద వాగులో దిగి అర్థనగ్నంగా దీక్ష చేపట్టారు.
అంతకుముందు బోథ్ పొచేర క్రాస్‌రోడ్ వద్ద జొన్నకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఇలా రోజు కొత్తగా నిరసన వ్యక్తం చేస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి గానీ, అధికారుల నుంచి గానీ ఎలాంటి హామీ అందలేదని జొన్న రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Next Story






