ఎమ్మెల్యే కాన్వాయ్‌పై చెప్పుల వర్షం..

30

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి వెళ్లిన అధికార పార్టీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్‌పై రైతులు చెప్పుల వర్షం కురిపించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను నిలువరించే ప్రయత్నం చేశారు.

గత కొంతకాలంగా ఫార్మా సిటీకి వ్యతిరేకంగా తాము పోరాడుతుంటే పట్టించుకోవడం లేదని.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయన కాన్వాయ్ పై చెప్పులు విసిరారు. ఈ ఘటన యాచారం మండలం మేడిపల్లిలో గురువారం వెలుగులోకి వచ్చింది. అయితే, నిరసనల మధ్యలో కూడా ఎమ్మెల్యే తన పర్యటనను కొనసాగించారు.