ప్రభుత్వం వద్దన్నా భారీగా వరినాట్లకు సిద్ధమౌతున్న రైతులు..

by Shyam |   (  Updated:2021-12-14 07:30:38  IST  )

<p>దిశ, మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మాగనూరు, మఖ్తల్, నర్వ, మండలాల్లో రైతులు వేలాది ఎకరాల్లో వరి సాగు చేయడానికి వరి మళ్ళలో మొలకను సిద్ధం చేసుకుంటున్నారు. యాసంగిలో రైతులు వరి సాగు చేసుకోరాదని ప్రభుత్వం రైతు వేదికల్లో సమావేశాలు ఏర్పాటు చేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో గ్రామ గ్రామాన సమావేశాలు నిర్వహిస్తున్న రైతులు మాత్రం వరి సాగుని వదలడం లేదు. ఈ విషయంపై రైతులను కదిపితే. బోర్ల కింద, బావుల కింద ఇప్పటి [&hellip;]</p>

ప్రభుత్వం వద్దన్నా భారీగా వరినాట్లకు సిద్ధమౌతున్న రైతులు..
X

దిశ, మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మాగనూరు, మఖ్తల్, నర్వ, మండలాల్లో రైతులు వేలాది ఎకరాల్లో వరి సాగు చేయడానికి వరి మళ్ళలో మొలకను సిద్ధం చేసుకుంటున్నారు. యాసంగిలో రైతులు వరి సాగు చేసుకోరాదని ప్రభుత్వం రైతు వేదికల్లో సమావేశాలు ఏర్పాటు చేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో గ్రామ గ్రామాన సమావేశాలు నిర్వహిస్తున్న రైతులు మాత్రం వరి సాగుని వదలడం లేదు. ఈ విషయంపై రైతులను కదిపితే.

బోర్ల కింద, బావుల కింద ఇప్పటి మళ్ళను తయారు చేశామని అలా చేసినా దానిలో వరి సాగు తప్ప ఇతర ఆరుతడి పంటలు సాగు చేయరాదన్నారు. బు‌రద, సౌవుడు నేలల్లో అధికారుల మాటలు విని తమ పొలాల్లో ఇతర పంటలను సాగు చేసిన కలుపు మొక్కల మధ్య పంట మొక్కలు కనిపించకుండా పోతాయన్నారు. కలుపు ఏరడానికి అయ్యే ఖర్చు పెట్టుబడి అంత అవుతుందన్నారు. అలాగే ఆరు తడి పంటల దిగుబడి తక్కువగా వస్తుందని దాని కంటే వరి వేయడమే నయం అని రైతులు చెబుతున్నారు.

Next Story